- Step 1
బంగాళాదుంపలు ఉడికించి తొక్కతీసి ముక్కలుగా కోయాలి.
- Step 2
ఓ గిన్నెలో కార్న్‌ఫ్లోర్, మైదా, కారం, మిరియాలపొడి, ఉప్పు, ఫుడ్‌కలర్, అల్లం-వెల్లుల్లి ముద్ద, పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి గుజ్జులా కలపాలి.
- Step 3
ఇందులో బంగాళాదుంప ముక్కలు ముంచి తీయాలి. పది నిమిషాల తరవాత నూనెలో పకోడీల మాదిరిగా దోరగా వేయించాలి.
- Step 4
విడిగా ఓ కళాయి తీసుకుని రెండు టేబుల్‌స్పూన్ల నూనె పోసి కాయాలి.
- Step 5
కరివేపాకు, పచ్చిమిర్చి ఓసారి కలిపి, వేయించిన ఆలూ ముక్కలు కూడా వేసి సన్నసెగమీద ఉంచాలి.
- Step 6
కొద్దిగా నీళ్లు చల్లి బాగా వేగిన తరవాత కొద్దిగా కారం, కొత్తిమీర చల్లి దించాలి.
- Step 7
అంతే ఘుమఘుమలాడే పంజాబీ స్టైల్ ఆలూ ప్రై రెడీ. దీన్ని స్నాక్స్‌గానూ, రొట్టెల్లోనూ లాగించేస్తే సరిపోతుంది.