- Step 1
ముందుగా శెనగపప్పును శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోయాలి. అందులోనే బఠాణీలు, ఉప్పు వేసి ఉడికించాలి.
- Step 2
అల్లం, పచ్చిమిర్చి కలిపి ముద్దగా నూరుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, పసుపు, అల్లం పచ్చిమిర్చి ముద్ద వేసి వేయించాలి.
- Step 3
తరువాత అందులో ముందుగానే ఉడికించిన పప్పు, బఠాణీలతో పాటు ఉప్పు, కారం వేసి కలపాలి.
- Step 4
తరువాత పంచదా, ఆమ్‌చూర్, కొబ్బరి తురుము వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి.
- Step 5
చివర్లో నిమ్మరసం పిండి, కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే వేడి వేడి శనగపప్పు బఠాణీల కూర రెడీ అయినట్లే..! ఇది వేడి వేడి అన్నంలోకి, చపాతీలు, రోటీల్లోకి చాలా రుచిగా ఉంటుంది.