- Step 1
ముందుగా కుక్కలర్ లో కందిపప్పు వేసి, నీళ్ళతో శుభ్రంగా కడగాలి.
- Step 2
తర్వాత అందులో మూడు కప్పుల నీళ్ళు, ఉప్పు, పసుపు వేసి రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.
- Step 3
అంతలోపు, డీప్ బాటమ్ పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడయ్యాక అందులో ఇంగువ, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర తరుగు, మెంతులు, ఆవాలు వేసి వేయించుకోవాలి.
- Step 4
ఒక నిముషం తర్వాత అందులో శెనగపప్పు మరియు కొబ్బరి తురుము వేసి తక్కువ మంట మీద మరో 5నిముషాల పాటు వేగించాలి.
- Step 5
ఇప్పుడు ఈ వేయించిన మిశ్రమాన్నంతా పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
- Step 6
తర్వాత ప్రెజర్ కుక్కర్ మూత తీసి, స్టౌ మీద పెట్టి, అందులో కట్ చేసి పెట్టుకొన్న టమోటో, బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, మునగకాడలు మరియు పేస్ట్ చేసి పెట్టుకొన్న మసాలా వేసి, టేస్ట్ కు సరిపడా ఉప్పు వేసి, ఎక్కువ మంట పెట్టి ఐదు నిముషాలు ఉడికించాలి.
- Step 7
ఇప్పుడు అందులో కరివేపాకు ఆకులు వేసి, మూత పెట్టి మరో విజిల్ వచ్చే వరకూ ఉడికించాలి.
- Step 8
అంతే కొంకనీ సాంబార్ రెడీ... దీన్ని వేడి వేడి ప్లేయిన్ రైస్ కు చాలా బాగా ఉంటుంది.