- Step 1
ముందుగా కొత్తిమీరని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఇందులో కొబ్బరి తురుము, మెత్తగా దంచిన గసగసాలు, కందులు, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముద్ద, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
శెగనపిండిలో కూడా కొద్దిగా ఉప్పు వేసి చపాతి పిండిలా కలుపుకోవాలి.
- Step 4
చిన్న ఉండలుగా చేసుకుని చపాతి చేసుకోవాలి. చపాతీలు పైభాగంలో స్పూనుతో పెరుగు రాయాలి. మధ్యలో కొత్తిమీర మిశ్రమాన్ని పెట్టి నాలుగువైపులా మూసేయాలి.
- Step 5
ఇలా రోల్స్‌ని తయారుచేసుకుని ఇడ్లీ రేకులపై పెట్టి ఓ పదినిమిషాలు ఉడికించి దించేయాలి.
- Step 6
తరువాత కడాయిలో నూనె పోసి బాగా కాగాక ఈ రోల్స్‌ని వేసి ఎరుపు రంగు వచ్చే వరకూ వేగించి దించేయాలి.