- Step 1
ఒక పాన్ స్టవ్ పై ఉంచి, కొద్దిగా నెయ్యి వేసి ముందుగా అందులో జీడిపప్పు, బాదంపప్పు ముక్కలు వేసి అవి వేగాక, క్యారెట్ తురుము వేసి వేగించాలి. తరువాత కొబ్బరి తురుము కూడా వేసి అయిదు నిమిషాలు వేగించి, తరువాత పంచదార వేసి కాస్త దగ్గరగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. చివరగా యాలకుల పొడి చల్లి దించేయాలి.
- Step 2
తరువాత మరో పాత్ర స్టవ్ పై ఉంచి అందులో కొద్దిగా నీళ్లు, పంచదార వేసి లేత పాకం వచ్చే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. సువాసన కోసం ఈ పాకంలో యాలకుల పొడిగాని, రోజ్ వాటర్ గాని కలుపుకోవచ్చు.
- Step 3
తర్వాత గులాబ్ జామ్ పౌడర్ లో నీళ్లు పోసి ఉండలు చేసుకునేందుకు వీలుగా పిండిని కలిపి అయిదు నిమిషాల పాటు నాననివ్వాలి.
- Step 4
ఈలోపు క్యారెట్ హల్వాను కూడా చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి.
- Step 5
తర్వాత గులాబ్ జామ్ పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుని చిన్న పూరీలా ఒత్తి అందులో క్యారెట్ ఉండను ఉంచి అంచులు కలిపేసి ఉండగా చేసుకోవాలి.
- Step 6
ఇలా తయారైన ఉండలను చిన్న మంటపై ముదురు రంగు వచ్చేంత వరకు నేతిలో వేగించి తీసి పంచదార పాకంలో వేయాలి.