- Step 1
బోన్‌లెస్ చికెన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- Step 2
కుక్కర్‌లో చికెన్, ఉప్పు, కారం, పసుపు, ఒక టీ స్పూను అల్లంవెల్లుల్లి ముద్ద, కొద్దిగా నీళ్లు పోసి రెండు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి.
- Step 3
ఇంతలో రెండు బ్రెడ్ ముక్కల్ని నానపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 4
చల్లారిన చికెన్‌లో నానిన బ్రెడ్ ముద్ద, మూడు బ్రెడ్ ముక్కల పొడి, కోడిగుడ్ల సొన, మిగిలిన అల్లంవెల్లుల్లి ముద్ద, సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 5
పొయ్యి మీద కడాయి పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఈ బాల్స్ వేసి వేగించి తీసేయాలి.