- Step 1
టమాటాలను శుభ్రంగా కడిగి, 5 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత తొక్కు తీసి వాటిని తరగి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
బాణలిలో 3 tbsp నూనె వేడి చేయాలి. తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ములక్కాడలు, ఉప్పు వేసి మూత పెట్టి, మునక్కాడ ముక్కలు చక్కగా ఉడికే వరకు వేయించాలి.
- Step 3
మూత తెరిచాక ఒకసారి కలిపి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
- Step 4
పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
- Step 5
ఉడికించి తరిగి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి ఒకసారి కలిపి 5 నిమిషాల పాటు సన్నని సెగ మీద ఉడికించాలి.
- Step 6
ముందే ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసి మరో 2 నిమిషాలు పాటు ఉడికించాలి. కొత్తిమీర వేసి స్టౌ ఆఫ్ చేయాలి.