- Step 1
ముందుగా ఉల్లిపాయలని ఓ ఐదు నిమిషాల పాటు వేయించి తీసి పక్కన పెట్టాలి, చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. * అలాగే టమాట ప్యూరీ రెడీగా వుంటే సరే లేకపోతే టమాటాలని నీళ్ళలో వేసి ఉడికించి, పైన ఊడివచ్చే పలచటి చెక్కు తీసేసి వాటిని మెత్తగా పేస్టులా గ్రైండ్ చేయాలి.
- Step 2
ఇలా ఉల్లిపాయ, టమాటా ముద్దలు సిద్దం చేసుకున్నాకా, పన్నీరుని కోరుకోవాలి.
- Step 3
ఇప్పుడు బాణలిలో నూనె వేసి, జీలకర్ర, పచ్చిమిర్చి, కసూరీ మేతి వేసి వేయించాలి.
- Step 4
ఆ తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి ఎర్రగా వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముద్ద , టమాటా ప్యూరీలని కూడా వేసి అవి నీరు వదిలి దగ్గరుగా అయ్యేదాకా వేయించాలి.
- Step 5
అప్పుడు గరం మసాల, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపాకా, ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలిఫ్లవర్ ని కూడా వేసి ఓ 5 నిముషాలు స్టవ్ పై వుంచాలి.
- Step 6
ఆఖరున తురిమి పెట్టుకున్న పన్నీరుని కలిపి, కలియబెట్టి ఓ 5 నిముషాలు స్టవ్ పై వుంచి దించాలి. పన్నీరు వేసాకా మూత పెట్టకూడదు. నీరు వచ్చేస్తుంది...
- Step 7
కాలీఫ్లవర్ కి అన్ని మసాలా రుచులతో పాటు పన్నీరు కూడా చేరి కూర చాలా రుచిగా వుంటుంది.