- Step 1
ముందుగా వేరుశనగ పప్పు, ఎండు మిర్చి, ఎండు కొబ్బరి దోరగా వేయించి, వాటిని మిక్సీ లో వేసుకుని వీటి తో పాటు టమోటో కూడా కలిపి పేస్ట్ లా చేసి ప్రక్కన పెట్టుకోవాలి.
- Step 2
తర్వాత వంకాయ లను బాగా కడిగి వాటికి తొడిమను తీసివేసి , వంకాయలను నిలువుగా 3/4 భాగం వరకు కట్ చేసుకుని, ముందుగా రెడీ చేసుకున్న మసాలా మిశ్రమాన్ని వంకాయలలో పెట్టుకోవాలి.
- Step 3
2ని॥ లు ఉంచిన తర్వాత, ప్యాన్ ష్టవ్ పై ఉంచి oil వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, వేసి చిటపట్ అనే శబ్దం వచ్చిన తర్వాత ఉల్లిపాయలు వేసి broun కలర్ కి మరాక వంకాయలు , మిగిలిన మాసాల మిశ్రమాన్ని కూడా అందులో వేసి కొద్దిగా పసుపు, కారం, తగిన ఉప్పు కలిపి కొద్దిగా వేగాక కొంచెం water కలిపి 10 ని॥ లు ఉడికించాలి.
- Step 4
తరువాత కొంచెం కరివేపాకు కలుపుకుని , ష్టవ్ off చేసి కొత్తిమీర తురుము తో గార్నిష్ చేస్తే గుమగుమ లాడే పల్లీల గుత్తి వంకాయ కూర రెడీ.