- Step 1
ముందుగా సిద్ధం చేసుకున్న ఖోవా నుంచి రెండు స్పూన్లు పక్కన పెట్టి, మిగిలిన దాంట్లో, మైదావేసి, బాగా పిసికి కలపాలి.
- Step 2
ఆ తరువాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న దాక్షపళ్ల సైజులో వుండలుగా చేయాలి.
- Step 3
రెండు కప్పుల నీళ్లను స్టవ్‌పై గినె్నలో వేసి, కాస్త మరిగాక పంచదార వేసి కలిపి, లేత పాకం పట్టాలి.
- Step 4
అప్పుడు ఖోవా వుండలు అందులో వేసి కాస్సేపు వుడికించాలి.
- Step 5
ఈ సమయంలో ఉండలు విడిపోకుండా జాగ్రత్తవహించాలి. ఆ తరువాత వాటిని మిశ్రమంలోంచి తీసి పక్కన వుంచాలి.
-
ఖీర్ తయారీ -
- Step 6
లీటరు పాలను స్టవ్‌పై గినె్నలో వేసి, పక్కన పెట్టిన రెండు స్పూన్ల ఖోవాను అందులో కలపాలి. రెండు స్పూన్ల పంచదారను అందులోవేసి, పాలు సగానికి తరిగేలా సన్నసెగన మరిగించాలి.
- Step 7
ఆ తరువాత మిగిలిన పంచదారను పాలల్లో వేసి బాగా కలియపెట్టాలి.
- Step 8
యాలకులపొడి, జీడిపప్పు, కిస్‌మిస్ వేసి, స్టవ్ ఆర్పి, మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
- Step 9
అప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న అంగూర్‌లను ఆ పాలమిశ్రమంలో వేసి, ఒక గంటసేపు నాననివ్వాలి. చల్లగా ఇష్టపడేవారు ఫ్రిజ్‌లోక కూడా వుంచచ్చు.