- Step 1
ముందుగా చింతపండు రసాన్ని చేసుకొని ,మిర్చిని,బెండ కాయలను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- Step 2
తర్వాత బౌల్ లో ఆయిల్ పోసి మరిగెంత వరకు ఉంచాలి ,తర్వాత ఉల్లి పాయలు వేసి వాటిని లైట్ గా వేహించిన తర్వాత కట్ చేసిన మిర్చిని వేయాలి.
- Step 3
అవి కొంచెం ఎర్రగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ,వెల్లుల్లి పాయలు వేసి ఫ్రై చేయాలి.
- Step 4
తర్వాత బెండకాయలు వేసి,సగం ఉడికాక చిల్లి పౌడర్ వేయాలి, ఫ్రై అయ్యేంతవరకు చూడాలి .
- Step 5
తర్వాత చింతపండు రసం ,కొబ్బరి పొడి ,దనియాల పొడి ,ఉప్పు వేసి స్టవ్ ని సిమ్ లో పెట్టాలి.
- Step 6
5 నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లి,వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది .