- Step 1
క్యాప్సికం,టమాటో లను క్యూబ్స్ గా గానీ, నిలువు చీలికలుగా గానీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
టమాటో లోని గింజలను తీసిన తర్వాతే కట్ చేసుకోవాలి.
- Step 3
ఉల్లిపాయను కూడా మీకు నచ్చినట్లుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
- Step 4
మోజరేల్లా ఛీజ్ ని చక్కని స్లైసెస్ గా కోసి ఉంచుకోవాలి.
- Step 5
నాలుగు బ్రెడ్ ముక్కల్ని తీసుకొని, అన్నింటి మీదా పిజ్జా టాపింగ్ ని వేసి సమానంగా పరచుకునేటట్లు స్పూను వెనక భాగంతో రుద్దాలి.
- Step 6
తర్వాత అన్ని కూరగాయ ముక్కల్ని కూడా సమానంగా పరవాలి. కట్ చేసి పెట్టుకున్న ఛీజ్ ముక్కల్ని పైన పెట్టుకోవాలి.
- Step 7
డ్రై ఆరిగానో, బేసిల్ లను కొద్దిగా స్ప్రింకిల్ చేయాలి.
- Step 8
పాన్ లో చేయాలనుకుంటే, పెనానికి కొద్దిగా నూనె రాసి, బ్రెడ్ స్లైస్ లని పెట్టి, పైన మూత పెట్టి సిమ్ లో ఉంచి ఛీజ్ కరిగే వరకు ఉడికించాలి.
- Step 9
ఓవెన్ లో అయితే, 180 °C వద్ద 9 నిమిషాలు లేదా ఛీజ్ కరిగేవరకు బేక్ చేయాలి.