- పండుమిరపకాయల్ని శుభ్రం చేయుట:
- Step 1
ముందుగా మిర్చిలను శుభ్రంగా కడిగి పొడి బట్టతో తడి లేకుండా తుడవాలి.
- Step 2
తర్వాత 15 నుండి 20 నిమిషాల పాటు ఎండలో పెట్టాలి.ఎండ లేకపోతే సీలింగ్ ఫ్యాన్ కింద అయినా పెట్టి ఆరనివ్వాలి.
- Step 3
ఆరాక తొడిమలు ఒలిచి పక్కన పెట్టుకోవాలి.
-
చింతపండును సిద్దం చేయుట:
- Step 4
కొత్త చింతపండు తీసుకొని, అందులో గింజలు, పెంకులు, పీచు లాంటివి లేకుండా శుభ్రం చేయాలి.
- Step 5
తర్వాత దానిని ఒక పొడిగా ఉన్న డబ్బాలో పెట్టాలి(స్టీలు డబ్బా వాడకూడదు
-
మిర్చిలను గ్రైండ్ చేయుట:
- Step 6
మిరపకాయలను చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో ఉప్పు, పసుపులతో పాటు వేసి కచ్చా పచ్చాగా నూరుకోవాలి(మెత్తగా రుబ్బకూడదు).
- Step 7
ఆ రుబ్బిన మిశ్రమాన్ని చింతపండు మీద ఉంచి, డబ్బా మూత పెట్టి 2 నుండి 3 రోజుల పాటు నాననివ్వాలి.
- Step 8
పచ్చి మిర్చి గుజ్జులోని తడి వల్ల కింద ఉన్న చింతపండు నానుతుంది.
-
పచ్చడి తయారీ:
- Step 9
మూడు రోజుల తర్వాత మూత తెరిచి, పైన ఉన్న మిర్చి గుజ్జు తీసి పక్కన పెట్టేసి, చింతపండును, వెల్లుల్లి రెబ్బలను తీసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.
- Step 10
అందులో పక్కన ఉంచుకున్న మిర్చి గుజ్జును, మెంతి పిండిని, అవసరమైతే కొద్దిగా ఉప్పును వేసి ఒక 2 నుండి 3 సెకన్ల పాటు మిక్సీ తిప్పాలి.
- Step 11
తయారైన పచ్చడిని జాడీ లో ఉంచి భద్రపరచుకోవాలి.కావాల్సినప్పుడల్లా కొద్దిగా తీసుకొని తాలింపు పెట్టుకోవాలి.
- పోపు పెట్టుట:
- Step 12
ఒక చిన్న పెనంలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.
- Step 13
అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగలు, మిమునులు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి చిటపటలాదేవరకు వేయించి పచ్చట్లో వేసి బాగా కలపాలి.