- Step 1
ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ లేదా దళసరి గిన్నె పెట్టుకుని రెండు స్పూన్ల నేయి వేసి పెసర పప్పు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు మరికొంచెం నేయి లేక నూనె తీసుకొని.. అందులో ముందుగా దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి (కొద్దిగా దంచి), పలావు ఆకు, జీలకర్రతో వేసి వేయిస్తూ కడిగిన కూరగాయ ముక్కల్ని కూడా వేసి దోరగా వేయించుకోవాలి.
- Step 3
అందులో ముందు వేయించి పెట్టుకున్న పెసరపప్పు నానబెట్టి ఉంచుకున్న బియ్యం వేసి కొలతగా 3 to 4 గ్లాసులు సుమారుగా చూసుకొని పోసి అందులో పసుపు, ఉప్పు, చక్కెర, కారం కలిపి కుక్కర్ 3,4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి.
- Step 4
ఇప్పుడు రెడీ అయిన కిచిడీ ని కొంచంసేపు చల్లారనిచ్చి దానిపై నేతిపోపు ఎండుమిరప జీలకర్రతో కలిపి వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. దీనికి అప్పడం జోడించి తింటే.. ఇక ఆరుచికి సాటి రాదు ఏదీ..