- Step 1
పుట్టగొడుగుల్ని శుభ్రంగా కడిగి నాలుగు ముక్కలుగా కట్ చేయాలి.
- Step 2
బంగాళాదుంపల్ని, ఉల్లిపాయల్ని కూడా తరిగి పెట్టుకోవాలి.
- Step 3
ఒక బాణలిలో నూనె వేడి చేసి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి అవి మేతతబడే వరకు వేయించాలి.
- Step 4
తర్వాత బంగాళదుంప ముక్కలు, పుట్టగొడుగులను కుడా వేసి ఒక సారి కలిపి మూత పెట్టి అయిదు నిమిషాల పాటు ఉడికించాలి.
- Step 5
మూత తెరచి అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం వేసి కలుపుకోవాలి.
- Step 6
ఒక రెమ్మ పుదినా ఆకులు, టమాటో ముక్కలు వేసి ఇంకో అయిదు నిమిషాలు ఉడికించాలి.
- Step 7
బాగా గిలకొట్టిన పెరుగు, గరం మసాలా వేసి కలిపి నూనె తేలేవరకు ఉడికించి, కొత్తిమీర వేసి స్టౌ ఆపుచేయాలి.