- Step 1
ముందుగా మసాలా కోసం తీసుకున్నవన్ని మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళు చిలకరించి మెత్తగా రుబ్బాలి.
- Step 2
వెడల్పాటి పాన్ లో నూనె వేసి కాగాక ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.
- Step 3
తర్వాత టమాటా ముక్కలు వేయాలి. వేగాక మసాలా వేసి బాగా కలపాలి.
- Step 4
ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసి కాసేపు ఉడికించుకోవాలి.
- Step 5
తర్వాత కప్పు నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు గుడ్లను పగలకొట్టి సొనను జాగ్రత్తగా కూరలో వేయాలి.
- Step 6
ఈ సొనలు ఒకదానికొకటి తగలకుండా, చెదిరిపోకుండా జాగ్రత్తగా వేయాలి.
- Step 7
ఇప్పుడు నెమ్మదిగా ఓ స్పూన్ గ్రేవీ ని గుడ్ల సొన మీద వచ్చేలా కప్పాలి.
- Step 8
ఇప్పుడు సొనలు ఉడికే వరకు కదపకుండా ఉడికించుకోవాలి. తర్వాత కొబ్బరి పాలు పోసి మెల్లగా కలపాలి.
- Step 9
గుడ్లు పూర్తిగా ఉడికాయి అనుకున్న తర్వాత కొత్తిమీర తురుము చల్లి దించాలి.
- Step 10
ఈ ఎగ్ డ్రాప్ కర్రీను గోవావాసులు ఎక్కువగా చేసుకుంటారు.