- Step 1
చికెన్ బ్రెస్ట్‌ను శుభ్రంగా కడిగి చదరపు ముక్కలుగా కోసుకోవాలి.
- Step 2
టొమాటోలు మిక్సీలో వేసి గుజ్జుగా చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
మొక్కజొన్న గింజల్లో నాలుగు కప్పుల నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. వాటిని వడకట్టాలి.
- Step 4
నాన్‌స్టిక్ పాన్‌లో నెయ్యి వేసి అది వేడెక్కాక అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేసి వేగించాలి.
- Step 5
ఇందులో టొమాటో గుజ్జు వేసి సన్నటి మంట మీద కాసేపు ఉంచాలి.
- Step 6
ఆ తరువాత చికెన్ ముక్కలు వేసి కలిపి ఎక్కువ తక్కువ కాకుండా ఓ మాదిరి మంట మీద ఉడికించాలి.
- Step 7
కొద్ది సేపటి తరువాత ఉప్పు, మసాలా దినుసులు వేసి మధ్య మధ్యలో కలపాలి.
- Step 8
ఆ తరువాత పెరుగు, ఉడికించిన మొక్కజొన్న గింజలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి మసాలా దగ్గర పడి, చికెన్ ముక్కలు ఉడికే వరకు ఉంచాలి.
- Step 9
చివరగా కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా రోటి లేదా నాన్‌తో తింటే వర్షపు ముసురుకు భలే రుచిగా ఉంటుంది.