- Step 1
ముందుగా చికెన్ సన్నని ముక్కలుగా కట్ చేయాలి.
- Step 2
ఒక ప్యాన్ లో నూనె వేసి, బాగా కాగిన తర్వాత వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.
- Step 3
తర్వాత క్యాప్సికం ముక్కలు, ఉడికించి ఉంచుకున్న చికెన్ ముక్కలు వేసి కొద్ది సేపు ఉడకనివ్వాలి.
- Step 4
ఆ తర్వాత కారం పొడి, వైట్ సాస్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
- Step 5
ఒక గిన్నె లో కొద్దిగా నీళ్ళు తీసుకొని బ్రెడ్ ముక్కల్ని నానబెట్టాలి.
- Step 6
తర్వాత నీటిని పిండేసి బ్రెడ్ ముక్కలఫై మద్యలో చికెన్ మిశ్రమము ఉంచి, బ్రెడ్ ను మడిచేసి రోల్ చేసుకోవాలి.
- Step 7
ఒక భాండి లో నూనె పోసి వేడి అయిన తర్వాత రోల్ చేసిన బ్రెడ్ ముక్కలని వేసి బంగారు వర్ణం వచ్చే వరకు వేయించుకోవాలి. వేగాక ఒక్కొక్క రోల్ ని రెండు గా కట్ చేసుకోవాలి. దీనికి టమాటో కెచప్ మంచి కాంబినేషన్.