- Step 1
ముందుగా బియ్యం, మొక్కజొన్న గింజలు కలిపి నానబెట్టుకోవాలి.
- Step 2
స్టవ్ మీద పెనం పెట్టి అందులో మూడు స్పూన్ల నూనె వేసి పట్టా, లవంగం, యాలకులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి.
- Step 3
ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి పాయలు, పుదీనా, కొత్తిమీర కలిపి వేయించాలి.
- Step 4
తర్వాత అందులో కొబ్బరి పాలు, కొంచెం నీళ్ళు పోసి బాగా ఉడికించాలి.
- Step 5
తగినంత ఉప్పును కలపాలి. ఈ మిశ్రమం బాగా తెర్లిన తర్వాత అందులో నానబెట్టిన బియ్యం, స్వీట్ కార్న్ వేసి ఉడికించాలి. బియ్యం బాగా ఉడికిన తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసి కలిపి దించుకోవాలి. అంతే మొక్కజొన్న పులావ్ రెడీ.