- Step 1
పానీపురి మసాలా కోసం సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర, పచ్చి మిర్చి, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా పొడి, ఆంచూర్ పొడి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- Step 2
ఒక గినెనలో బియ్యం పిండి, పుట్నాల పప్పు పొడి, ఉప్పు, వాము వేసి కలపాలి.
- Step 3
ఇందులో పానీపురి మసాలా ముద్ద వేసి కలపాలి. మరో గినె్నలో రెండు కప్పుల నీళ్లు మరిగించి రెండు చెంచాల నూనె వేయాలి.
- Step 4
ఈ నీళ్లను పిండిలో వేసి కలిపి మూత పెట్టి ఉంచాలి. చల్లారిన తర్వాత బాగా పిసికి పెట్టుకోవాలి.
- Step 5
మురుకుల గిద్దెలో కొంచెం కొంచెం పిండి ముద్ద పెట్టుకుని వేడి నూనెలో మురుకులు/జంతికల్లా వత్తుకుని నిదానంగా కాల్చుకోవాలి.