- Step 1
కీరదోస చెక్కుతోపాటు గింజల్నీ తీసేసి మెత్తని గుజ్జులా చేసి పెట్టుకోవాలి.
- Step 2
ఓ గిన్నెలో పాలు తీసుకొని, చక్కెర వేసి పొయ్యి మీద పెట్టాలి.
- Step 3
అవి మరిగాక అందులో కీరదోస గుజ్జు వేసి బాగా కలపాలి.
- Step 4
మంట తగ్గించి మధ్య మధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి అది చిక్కబడుతుంది.
- Step 5
ఓ బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం, పిస్తా పలుకుల్ని వేయించుకోవాలి.
- Step 6
ఎండు ద్రాక్ష తప్ప మిగిలిన అన్నీ పలుకుల్ని మెత్తగా కాకుండా పోడిలా చేసుకోవాలి.
- Step 7
ఇప్పుడు ఎండు ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్ పొడి, యాలకుల పొడి పాలల్లో వేసి వేసి మళ్ళీ కలిపి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.