- Step 1
ముందుగా మెంతి ఆకులను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పడు పాన్ లో నూనె వేడిచేసి అందులో మెంతిఆకులను వేసి ఫ్రై చేసుకోవాలి.
- Step 3
ఫ్రై చేసుకున్న ఆకులను ఒకప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి
- Step 4
అదే ప్లేట్ లో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు, పసుపు, కర్వేపాకు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి.
- Step 5
ఉల్లిపాయలు ఫ్రై అయిన తరువాత అందులో టమాటాలు, ఉప్పు వేసి మగ్గించాలి.
- Step 6
టమాటాలు బాగా మగ్గిన తరువాత ముందుగా ఫ్రై చేసుకున్న మెంతిఆకులు వేసి కలిపి 5 నిమిషాలు సిమ్ లో మగ్గించి కొత్తిమీర వేసి దించాలి. అంతే రుచికరమైన టమాట మెంతికూర రెడీ.