- Step 1
మటన్ ముక్కల్ని కడిగి పక్కన ఉంచాలి. గరంమసాలా దినుసులన్నింటినీ పలుచని బట్టలో మూటకట్టాలి. ప్రెషర్పాన్లో మటన్ముక్కలు, ఉప్పు, కారం మసాలా దినుసుల మూట వేసి ఉడికించాలి.
- Step 2
మందపాటి బాణలిలో నెయ్యి వేసి ఉడికిన మటన్ ముక్కల్ని వేసి వేయించాలి.
- Step 3
మరో బాణలిలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి ఉల్లిముక్కలు, టమాట ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లంవెల్లుల్లి తురుము వేసి వేయించాలి.
- Step 4
తరువాత మసాలా పొడి వేసి కలపాలి. ఆమ్చూర్పొడి, పుదీనా ఆకులు కూడా వేసి కలిపి ఈ మిశ్రమాన్ని మటన్ ముక్కల మీద వేసి కలపాలి.
- Step 5
ఆమ్చూర్పొడి, పుదీనా ఆకులు కూడా వేసి కలిపి ఈ మిశ్రమాన్ని మటన్ ముక్కల మీద వేసి కలపాలి. చివరగా గసగసాలు, కొత్తిమీర తురుము కూడా చల్లితే మటన్ తవా రోస్ట్ రెడీ.