- Step 1
ఒక ఉల్లిగడ్డను కోసి దాంట్లో వెల్లుల్లిపాయలు, మిరియాలు, ధనియాలు కలిపి గ్రైండ్ చేసుకోవాలి.
- Step 2
ఉల్లిగడ్డను, బెండకాయలను చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
- Step 3
ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఉల్లిగడ్డ ముక్కలను వేసి వేయించాలి.
- Step 4
బంగారు వర్ణం వచ్చేవరకు ఉంచాక ఉల్లిగడ్డలతో చేసిన పేస్ట్‌ను వేసి మరికాసేపు కలపాలి.
- Step 5
దీంట్లో బెండకాయలను వేసి సన్నని మంట మీద 20 నిమిషాల పాటు వేగనివ్వాలి.
- Step 6
ఆ తర్వాత టమాటాలు, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి మరికాసేపు ఉంచాలి.
- Step 7
అయితే ఇవి కలిపేటప్పుడు బెండకాయలు చిదిమిపోకుండా జాగ్రత్తపడాలి.
- Step 8
పదినిమిషాల తర్వాత పుదీనా వేసి దించేస్తే సరిపోతుంది. సూపర్ అనిపించే.. భేండీ భాజీ మీ చవులూరించక మానదు!