- Step 1
నువ్వులు, గసగసాలు కలిపి వేగించి పొడిచేయాలి. దొండకాయల్ని నిలువుగా రెండు ముక్కలుగా కోసుకోవాలి.
- Step 2
మిగతా మసాల దినుసులను కూడా సన్నమంట మీద వేగించి పొడిచేయాలి.
- Step 3
దొండముక్కల్ని నూనెలో దోరగా వేగించాలి.
- Step 4
కడాయిలో 1 టేబుల్‌స్పూను నూనె వేసి కరివేపాకు, టమోటాలు వేగాక కారం, మసాలపొడి దొండముక్కలు కలపాలి.
- Step 5
నువ్వులు, గసగసాలపొడి, బ్రౌన్‌షుగర్, ఆమ్‌చూర్‌పొడి వేసి రెండు నిమిషాల తర్వాత కప్పు నీరు, ఉప్పు కలిపి మూతపెట్టాలి.
- Step 6
5 నిమిషాల తర్వాత వేరుశనగపొడి, మరో పావు కప్పు నీరు, కొత్తిమీర చల్లి నీరు ఆవిరయ్యేవరకు ఉంచి దించేయాలి.