- Step 1
మొదట దోసకాయలను, ఉల్లిపాయలను , టొమాటలను, అల్లంను ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
- Step 2
తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడించుకోవాలి.
- Step 3
అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.
- Step 4
తర్వాత దోసకాయ, అల్లం ముక్కలను వేసి ఐదు నిముషాలు ఉడకనివ్వాలి.
- Step 5
అనంతరం టమాటో ముక్కలు, తగినంత ఉప్పు, కారం పొడి, పసుపు వేసి ఐదు నిముషాలు నూనెలోనే ఉడకనివ్వాలి.
- Step 6
చివరిగా కొంచెం నీటిని చేర్చి మరో రెండు నిముషాలు ఉడకనివ్వాలి. అంతే దోసకాయ కూర రెడీ.