రోజూ ఒకే రకమైన వంట తిని విసుగుపుడుతోందా? అయితే ఖచ్చితంగా ఇది మీ కోసమే. అదిరిపోయే బ్రెడ్ పెరుగు వడ ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకోండి.
-
Prep Time
15 Minutes
-
Cooking Time
10 Minutes
-
Servings
2
కావాల్సిన పదార్ధాలు
- బ్రెడ్ : 5 స్లైసులు
- ఉల్లిపాయ : 1 (సన్నగా తరగాలి)
- అల్లం తురుము: 1 టీ స్పూన్
- పచ్చి మిర్చి : 2
- పెరుగు : ఒక కప్పు
- ఉప్పు : తగినంత
- కారం : కొద్దిగా
- చాట్ మసాలా : 1 టీ స్పూన్
- నూనె : తగినంత
- కొత్తిమీర : అలంకరణకు సరిపడ
తయారు చేయు విధానం
- Step 1
పెరుగులో అల్లం తురుము, కారం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీలో ఒకసారి తిప్పాలి.
- Step 2
బ్రెడ్ చివరలు కట్ చేసి స్లైస్‌ను నీటిలో ముంచి నీరంతా పిండేయాలి.
- Step 3
ఆ తర్వాత రెండు చేతుల మధ్య అదిమి మధ్యలో రంధ్రం చేయాలి.
- Step 4
అప్పుడు చూడటానికి వడలా వస్తుంది. బాణలి పెట్టి అందులో నూనె పోసి సన్నని మంట మీద ఉంచి ఈ బ్రెడ్ వడలను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
- Step 5
తరువాత మిక్సీలో తిప్పి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో వేయాలి.
- Step 6
ఐదు నిమిషాలలో తీసి పక్కన పెట్టి పైన చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు చల్లాలి.
- Step 7
కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేయడమే. చాలా సులువుగా తయారైపోతాయి ఈ వడలు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
యాలి. శెనగపిండి మిశ్రమంలో బీరకాయ ముక్కల్ని ముంచి కాగిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి.
Step 4
వీటిని వేడివేడిగా టొమాటో కెచప్‌తో తింటే టేస్టీగా ఉంటాయి.