- Step 1
మినపప్పు, ఇడ్లీరవ్వ, పెసరపప్పును వేర్వేరుగా నానబెట్టాలి. నానినపప్పును మెత్తగా రుబ్బుకుని అందులో కడిగిన ఇడ్లీరవ్వ కలపాలి.
- Step 2
నానిన పెసరపప్పును మరోసారి కడిగి నీరు వంపేసి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి.
- Step 3
ఇప్పుడు వేరుశనగపప్పు, జీడిపప్పు, సోంపు, యాలకులు కలిపి మిక్సీలో మెత్తని పొడిలా చేయాలి.
- Step 4
పొయ్యిమీద బాణలి పెట్టి అరకప్పు నీళ్లు మరిగించాలి.
- Step 5
ఆ నీటిలో పంచదార కరిగించి రుబ్బి పెట్టుకున్న పెసరపప్పు ముద్ద, వేరుశనగపప్పు పొడి, పచ్చికొబ్బరి తురుము వేసి ఉడికించాలి.
- Step 6
ఆ తరువాత ఎండుద్రాక్ష, జామ్ కూడా చేర్చి బాగా కలపాలి. మిశ్రమం దగ్గర పడ్డాక దింపేయాలి.
- Step 7
ఇప్పుడు మరీ లోతుగా లేని కుక్కర్ గిన్నెలో చెంచా నెయ్యి రాసి మినపప్పు మిశ్రమాన్ని రెండు గరిటెలు వేసి, సిద్ధం చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని తీసుకుని ఈ పిండిపై పరిచి పైన మరో రెండు గరిటెలు మినప్పిండి వేయాలి.
- Step 8
సన్నటిమంటపై ఉంచి, మూతపెట్టేసి పదినిమి షాలు ఉడకనివ్వాలి.
- Step 9
ఆ తరువాత తీసేసి మనకిష్టమైన ఆకృతిలో ముక్కలుగా కోసుకోవాలి.
- Step 10
స్కూలు పిల్లలు లంచ్ బాక్సులలోకి ఇది చాలా బాగుంటుంది.