- Step 1
అన్నిరకాల పప్పులు, బియ్యం, బార్లీ, సోయాబీన్స్‌ని ఆరు గంటలసేపు నానబెట్టాలి.
- Step 2
నీరు వడకట్టి, మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచుకోవాలి.
- Step 3
తగినంత నీటిలో అటుకులను పావుగంట సేపు నానబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.
- Step 4
రుబ్బి ఉంచుకున్న పిండి మిశ్రమంలో అటుకుల పిండి కలిపి మూడు నాలుగు గంటలు పక్కన ఉంచాలి.
- Step 5
జీలకర్ర వేసి కలపాలి. స్టౌ మీద పెనం పెట్టి, వేడయ్యాక పిండిని దోసెలా వేసి, పిండి పచ్చిగా ఉండగానే, పైన క్యారట్ తురుము, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు కొద్దికొద్దిగా వేసి బాగా కాలాక రెండవవైపు తిప్పి కాల్చి తీసేయాలి.