- Step 1
ముందుగా గోంగూరను శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక తరిగిన ఆవాలు, కరివేపాకు, మెంతులు, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసి వేయించుకోవాలి.
- Step 3
తరువాత చేప ముక్కలు వేసి అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి.
- Step 4
నీరంతా ఇంకిపోయిన తరువాత మిరపపొడి, దనియా, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
- Step 5
చెక్కా, లవంగాలు, టమోటోముక్కలు వేసి ఉడికించి చివరగా కొంచెం చింతపులుసు వేపి ఉడకనిచ్చి దింపుకోవాలి.
- Step 6
ఈ మిశ్రమాన్ని ఉడికించి పెట్టుకున్న గోంగూరతో కలుపుకుని, ఎండుమిర్చి నూనెలో వేయించిఅందులో వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే..గోంగూర ఫిష్ కర్రీ రెడీ.