- Step 1
ముందుగా మటన్‌ని శుభ్రంగా కడిగి కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసి కుక్కర్‌లో మూడు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించి దించేయాలి.
- Step 2
ఇప్పుడు పొయ్యిమీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కరివేపాకు, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి.
- Step 3
తర్వాత ఉప్పు, పసుపు, కారం, గరంమసాలా, ధనియాల పొడి వేసి కలిపాక దోసకాయ ముక్కలు వేయాలి.
- Step 4
ఐదు నిమిషాల తర్వాత ఉడికించి మటన్ వేసి మరో పదినిమిషాలు ఉడికించి దించేయాలి.
- Step 5
ఈ కూరను రోటీలు, చపాతీలు, వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేస్తే రుచిగా ఉంటుంది.