- Step 1
రెండు గంటల ముందుగా సెనగపప్పూ, మినప్పప్పూ, కందిప్పప్పూ, పెసరపప్పును నానబెట్టుకోవాలి. తరవాత నీళ్లు వంపేసి మెత్తని పిండిలా రుబ్బి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే జీడిపప్పూ, కొత్తిమీరా, పుదీనా, కరివేపాకూ, అల్లం, పచ్చిమిర్చి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
- Step 2
ఈ మిశ్రమాన్ని సెనగపప్పు ముద్దపై వేయాలి. అలాగే తగినంత ఉప్పూ, వంటసోడా కూడా వేసుకుని మరోసారి కలపాలి. ఈ పిండిని చిన్నచిన్న వడల్లా తట్టుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.
- Step 3
వీటి వేడి కాస్త చల్లారాక వేడినీటిలో వేసి నిమిషమయ్యాక తీసేయాలి. ఈ వడల్ని ఇప్పుడు ఉప్పూ, అల్లంతరుగూ, పచ్చిమిర్చి ముక్కలూ కలిపిన పెరుగులో వేసుకోవాలి. బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేడిచేసి ఆవాలూ, మినప్పప్పు వేయించి దింపేయలి.
- Step 4
ఈ తాలింపు వేడి చల్లారాక పెరుగుపై వేయాలి. చివరగా క్యారెట్ తురుమూ, కొత్తిమీరతో అలంకరిస్తే సరిపోతుంది.