- Step 1
అరకప్పు గోరువెచ్చని నీళ్లలో చింతపండు వేసి నానబెట్టాలి.
- Step 2
విడిగా ఓ పాన్‌లో టీస్పూను నూనె వేసి పొడి కోసం తీసుకున్నవన్నీ వేసి వేయించాలి. చల్లారాక పొడి చేయాలి.
- Step 3
టొమాటోను ముక్కలుగా కోసి అరకప్పు నీళ్లు పోసి మెత్తగా పిసికి రసం పిండాలి. కుక్కర్‌లో కందిపప్పు, పసుపు వేసిఉడికించాలి. తరవాత మెత్తగా మెదిపి టొమాటో రసం, చింతపండు రసం, ఉప్పు వేసి కలపాలి.
- Step 4
వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర మెత్తగా నూరాలి.
- Step 5
మందపాటి గిన్నెలో టీస్పూను నూనె వేసి వెల్లుల్లి మిశ్రమం వేసి వేగాక పప్పు, టొమాటో, చింతపండు రసం వేసి సిమ్‌లో మరిగించాలి. తరవాత రసం పొడి వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ మరికాసేపు మరిగించాలి.
- Step 6
చిన్న బాణలిలో నూనె వేసి తాలింపుదినుసులన్నీ వేసి రసంలో కలపాలి. చివరగా కొత్తిమీర వేస్తే కళ్యాణరసం రెడీ. పెళ్లిళ్లలో ఎక్కువగా ఈ పద్ధతిలోనే చేస్తుంటారు.