- Step 1
సెనగపప్పును పావుగంట నానబెట్టాలి.
- Step 2
అరిటికాయను, ఉల్లిపాయను, పచ్చిమిర్చిని ముక్కలుగా కోసి పక్కన వుంచాలి.
- Step 3
ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చేసి పోపుదినుసులు, వెల్లుల్లి, ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి.
- Step 4
అవి వేగాక ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు వేపాలి.
- Step 5
ఉల్లిముక్కలు వేగాక, అరటి ముక్కలు, సెనగపప్పు వేసి ఒకసారి బాగా కలిపి మూతపెట్టాలి.
- Step 6
చిన్నమంత మీద (సింలో) పది నిముషాలు ఉడికిన తరువాత మూత తీసి ఒకసారి కలిపి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి, కొద్దిగా నీళ్ళుపోసి కాసేపు మూత పెట్టాలి.
- Step 7
కూర పూర్తిగా ఉడికి నీళ్ళు మొత్తం యిగిరి, కూర పొడిపొడిగా అవుతుంది.
- Step 8
ఇప్పుడు మసాలాపొడి జల్లి, కొత్తిమిర వేసి స్టవ్ ఆపాలి.