- Step 1
చిక్కుడు కాయలు ముక్కలుగా చేసి కడగాలి.
- Step 2
స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చెయ్యాలి.
- Step 3
నూనె కాగాక పోపుదినుసులు వేసి వేగాక, ఎండిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి వేగాక పసుపు వేసి కలిపి, చిక్కుడు ముక్కలు, పచ్చిమిర్చి పేస్టు వేసి ఒకసారి కలిపి మూత పెట్టాలి.
- Step 4
చిన్న మంటమీద పది నిముషాలు వేగనివ్వాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
- Step 5
ఆవిరికి చిక్కుడు ముక్కలు మెత్తబడతాయి. ఇప్పుడు మూత తీసి కారం, ఉప్పువేసి కలిపి, రెండు నిముషాలు వేగనిచ్చి, తడి పోయాక స్టవ్ ఆపాలి. (ఉప్పు, కారం వేసాక మూత పెట్టకూడదు)