- Step 1
ముందుగా ఒక గిన్నెలో నీరు పోసి అది మరుగుతుండగా అందులో పన్నీర్ వేసి 5 నిమిషాలు ఉడికించి దించాలి.
- Step 2
గోంగూరును ఉడికించుకుని పెట్టుకోవాలి.
- Step 3
ఇప్పుడు పాన్ లో నెయ్యి వేడి చేసి అందులో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క, జీలకర్ర, జీడిపప్పు, వేసి దోరగా వేయించుకుని పేస్ట్ చేసుకోవాలి, గోంగూరను కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
- Step 4
ఇప్పుడు నూనె వేడి చేసి అందులో ముందుగా సిద్దం చేసుకున్న ఉల్లి,జీడిపప్పు, పేస్ట్, గోంగూర పేస్ట్, పన్నీర్ ముక్కలు వేసి బాగా కలిపి ఉప్పు, కారం, 2 కప్పులు నీరు పోసి సిమ్ లో కుక్ చేయాలి. అంతే రుచికరమైన పన్నీర్ గోంగూర రెడీ.