- Step 1
పాన్ లో నూనె వేడి చేసి అందులో క్యాప్సికమ్ ముక్కలు వేసి మగ్గించి ఒక ప్లేట్ లో కి తీసుకోవాలి.
- Step 2
అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో ఆవాలు, శనగపప్పు, , మినప్పప్పు, ఎండుమిర్చి, కర్వేపాకు, ఇంగువ వేసి వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
- Step 3
ఇప్పుడు నూనె వేయకుండ ఆవాలు, శనగపప్పు, మినప్పప్ప, మెంతులు, ఎండుమిర్చి, దోరగా ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసి పొడిచేయాలి.
- Step 4
మిక్సీలో ముందుగా ఉడికించుకున్న క్యాప్సికమ్, చింతపండు, ఆవాలపొడి, ఉప్పు అన్నీ వేసి మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా పోపు చేసుకున్న మిశ్రమంలో కలిపి సర్వ చేయాలి.