- Step 1
పైన చెప్పిన కూరగాయ ముక్కలన్నింటినీ ఒక గిన్నెలో వేయాలి. వాటిలో నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, వేగించిన ఉల్లి ముక్కలు కొన్ని, పెరుగు, కొత్తిమీర, పుదీనాల తరుగు, ధనియాల పొడి, నూనె వేసి అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు నానబెట్టాలి.
- Step 2
మరొక గిన్నెలో నీళ్లు పోసి అందులో గరంమసాలా, బిర్యానీ ఆకులు వేయాలి. నీళ్లు ఉడుకుపట్టాక కడిగిన బాస్మతి బియ్యం వేయాలి. బియ్యం సగం ఉడికాక నీళ్లను వంపేయాలి.
- Step 3
అన్ని వైపులా సమానంగా ఉన్న గిన్నె తీసుకుని నానబెట్టిన కూరగాయల్ని మొదటి పొరలా పరవాలి. దానిపైన సగం ఉడికిన బిర్యాని రైస్ వేసి నెయ్యి వేయాలి. గిన్నెని తవాపై పెట్టి సన్నటి మంట మీద పదినిమిషాలు ఉడికించాలి.
- Step 4
ఆ తర్వాత గిన్నె మీద మూతపెట్టి అంచులను మైదాతో మూయాలి. మూతమీద మండుతున్న బొగ్గులు వేసి 20 నిమిషాలు ఉంచాలి. కొత్తిమీర, పుదీనాల తరుగు, జీడిపప్పు, వేగించిన ఉల్లి ముక్కలతో అలంకరించాలి.