- Step 1
పెరుగులో ఉప్పు, పసుపు వేసుకుని కందముక్కలు వేయాలి. కాసేపయ్యాక పెరుగు పిండేసి ముక్కల్ని విడిగా తీసిపెట్టుకోవాలి.
- Step 2
బాణలిలో కొద్దిగా నూనె వేడిచేసి ఎండుమిర్చి, తాలింపు దినుసులు, మెంతుల్ని వేయించి పెట్టుకోవాలి.
- Step 3
అందులో కొన్ని తాలింపుగింజల్ని విడిగా తీసుకోవాలి. చింతకాయల్ని శుభ్రంగా కడిగి దంచుకోవాలి.
- Step 4
బాణలిలో మిగిలిన నూనె వేడిచేసి కందముక్కలు, చింతకాయ మిశ్రమాన్ని వేసి మగ్గనివ్వాలి.
- Step 5
ఇందులోనే పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసి కాసేపయ్యాక దింపేయాలి.
- Step 6
కావాలనుకుంటే మరికాస్త ఉప్పు వేసుకుని.. అన్నింటినీ మిక్సీ పట్టి చివరగా బెల్లం తురుము, కొబ్బరికోరు చేర్చితే సరిపోతుంది. మిగిలిన తాలింపు దినుసుల్ని పైన కలపాలి.