- Step 1
బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి మినప్పప్పూ, ఆవాలూ, మెంతులూ వేయించి తరవాత ఎండుమిర్చీ, ఇంగువా వేసేయాలి. రెండు నిమిషాల తరవాత ఈ తాలింపుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
- Step 2
అదే బాణలిలో మరో మూడు చెంచాల నూనె వేడిచేసి క్యాప్సికం ముక్కలూ, పచ్చిమిర్చీ, టొమాటో ముక్కలూ, మునగాకూ, చింతపండూ, బెల్లం వేసి మగ్గించాలి. మునగాకులోని పచ్చివాసన పోయాక దింపేయాలి.
- Step 3
ఇప్పుడు ముందుగా వేయించిన తాలింపూ, తగినంత ఉప్పూ, కొబ్బరీ, తాలింపూ, మునగాకు మిశ్రమాన్ని మిక్సీలో తీసుకుని మెత్తగా రుబ్బుకుంటే సరిపోతుంది. కమ్మని పచ్చడి సిద్ధం.