- Step 1
స్టవ్ మీద కళాయి పెట్టి అందులో కాస్త నెయ్యి వేయాలి.
- Step 2
బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర వేసి వేయించాలి.
- Step 3
అవి వేగాక నిలువుగా కోసిన పచ్చిమిర్చి, ఉల్లి పాయ ముక్కల్ని వేసి ఉంచాలి.
- Step 4
మెంతిఆకుల్ని కడిగి, నీరు పిండేసి వాటిని వేసి వేయించాలి. బంగాళదుంప ముక్కలు కూడా వేసివేయించాలి.
- Step 5
చిన్న మంట మీద వేయిస్తే అన్నీ బాగా వేగడమే కాదు, మెంతి ఆకుల పచ్చి వాసన కూడా పోతుంది.
- Step 6
ఇప్పుడు బియ్యం కడిగి నీరు ఒంపేసి వాటిని మెంతాకుల మిశ్రమంలో వేసి వేయించాలి.
- Step 7
రెండు నిమిషాల పాటూ వేయించాక గరం మసాలా, మిరియాల పొడి వేసి వేయించాలి.
- Step 8
అనంతరం ఉప్పు వేసి బాగా కలిపి.... బియ్యం ఉడికేందుకు రెండు కప్పుల నీళ్లు వేయాలి. మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. అన్నం ఉడికాక ఒక సారి కలిపి దింపేస్తే మెంతి పలావ్ తినేందుకు సిద్ధంగా ఉన్నట్టే.