- Step 1
సొరకాయ పొట్టును జాగ్రత్తగా తీసేయాలి. మిగతాదాన్ని తురుముకోవాలి.
- Step 2
ఆ తురుములో మైదాపిండి, గోధుమపిండి, అల్లం వెల్లుల్లి ముద్ద, జీలకర్ర, కారం వేసి బాగా కలపాలి. మరీ పొడిగా ఉంటే కాస్త నీళ్లు కలపొచ్చు.
- Step 3
ఆ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి.
- Step 4
నూనె వేడెక్కాక సోయా ఉండల్ని వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 5
అనంతరం మరో కళాయి స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో రెండు చెంచాల నూనె వేయాలి.
- Step 6
నూనె వేడెక్కాక ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
- Step 7
అందులో చిల్లీసాస్, టొమాటోసాస్, కొత్తిమీర తురుము వేసి కలపాలి. ముందుగా వేయించుకున్న మంచూరియాలను అందులో వేసి వేయించాలి. ఒక నిమిషం పాటూ వేయించి దించితే చాలు.