- Step 1
స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి.
- Step 2
అందులో క్యాబేజీ తురుము, క్యారెట్ తరుగు, రెడ్ చిల్లీసాస్, సోయాసాస్ వేసి కలపాలి. ఉల్లికాడల తురుము కూడా వేసి వేయించాలి.
- Step 3
తరువాత కాస్త ఉప్పు, కార్న్ ఫ్లోర్ వేసి వేయించాలి. అవి వేగాక ఉడికించిన నూడుల్స్ ను వేసి కలపాలి. వేగాక బయటికి తీసి ప్లేటులో పెట్టి... తడి ఎక్కువ లేకుండా ఆరనివ్వాలి.
- Step 4
ఇప్పుడు మరో గిన్నెలో మైదాపిండి, ఉప్పు, కాస్త నూనె, నీళ్లు వేసి బాగా కలపాలి. పిండిని ముద్దలా కలుపుకుని మూత పెట్టి కాసేపు అలా ఉంచేయాలి.
- Step 5
అరగంట తరువాత ఆ ముద్దని చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తాలి.
- Step 6
పూరీని సగానికి కోసి త్రికోణాకారంలో మడతబెట్టి, లోపల నూడిల్స్ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేయాలి. అన్నీ ఇలాగే చేసుకున్నాక... వాటిని నూనెలో డీప్ ఫ్రై చేయాలి. వీటిని టమాటో సాస్ తో తింటే భలే రుచి ఉంటాయి.