- Step 1
చికెన్ ను ఖీమాలా కొట్టించాలి. ఇప్పుడు స్టవ్ కుక్కర్ పెట్టి కాస్త నూనె వేసి ఉల్లిపాయల తరుగు వేసి వేయించాలి. కాస్త పసుపు, గరం మసాలా, కారం, వేసి కలపాలి.
- Step 2
ఇప్పుడు చికెన్ కూడా వేసి బాగా కలపాలి. అందులో తురిమిన కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి వేయించాలి.
- Step 3
బాగా వేగాక కొద్దిగా నీరుపోయాలి. కుక్కర్ పై మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేయాలి.
- Step 4
ఇప్పుడు మైదాని ఒక గిన్నెలో వేసుకుని అర టీస్పూను ఉప్పు వేయాలి. కాస్త నీళ్లు వేసి బాగా కలిపి పూరీ ఉండలు చుట్టుకోవాలి.
- Step 5
పూరీలకు చుట్టుకునేట్టు పెద్దవి కాకుండా... కాస్త చిన్నవి చుట్టుకోవాలి. వాటిని పూరీల్లా ఒత్తుకోవాలి.
- Step 6
బజ్జీ మిర్చీలకు మధ్యలో గాటు పెట్టి... చికెన్ మిశ్రమాన్ని కూరాలి. ఆ మిర్చి చుట్టు ఒత్తుకున్న పూరీని చుట్టేసి చివర్లు నొక్కేయాలి.
- Step 7
వాటిని నూనెలో వేయించాలి. అంతే చికెన్ మిర్చీ బజ్జీ తయారైనట్టే. నాన్ వెజ్ ప్రియులకు ఈ చికెన్ బజ్జీ భలే రుచిగా ఉంటుంది.