- Step 1
మరీ పుల్లగా లేని మామిడికాయని ఎంచుకోవాలి. తొక్కని చెక్కేయాలి. తరువాత ముక్కులుగా కోసి తురిమేసుకోవాలి.
- Step 2
అలాగే బంగాళాదుంపని కూడా తురుములా తరిగేయాలి. అలాగే ఉల్లిపాయ, అల్లం, పచ్చి మిర్చి కూడా తరిగేయాలి.
- Step 3
ఒక గిన్నెలో శెనగపిండి వేసి కాస్త నీళ్లు వేసి కలపాలి. అందులో మొదట ఉప్పు వేసి కలపాలి.
- Step 4
అనంతరం మామిడి తురుము, బంగాళాదుంప తురుము, ఉల్లిపాయ తురుము, అల్లం తురుము, పచ్చిమిర్చి తురుము, కొత్తి మీర తరుగు వేసి బాగా కలపాలి.
- Step 5
పకోడీలు వేయడానికి సరిపడా పదును వచ్చేలా కలుపుకోవాలి. కావాలంటే నీళ్లు చేర్చుకోవచ్చు. ఆ మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టేయాలి.
- Step 6
తరువాత స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడే నూనెని వేయాలి. నూనె వేడెక్కాక పకోడీల్లా వేసుకోవాలి. గోల్డ్ బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించుకుని తీసి ప్లేటులో పెట్టుకోవాలి. వాటిని ఉత్తగా తిన్నా లేక సాస్ తో తిన్నా బాగుంటాయి.