- Step 1
బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసేయాలి. వాటిని చిన్నముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు సోయా గ్రాన్యూల్స్‌ను కూడా వేడి నీళ్లలో వేసి రెండు నిమిషాలు ఉడికించాలి.
- Step 3
అనంతరం చల్లనినీళ్లలో వేసి, పిండేసి నీళ్లు లేకుండా చేసుకోవాలి.
- Step 4
వాటిని మిక్సీలో వేసి అర నిమిషంపాటూ తిప్పాలి. పేస్టులా కాకుండా.. తరుగులా చేసుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 5
ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి... కాస్త నూనె వేయాలి. అందులో జీలకర్ర, పలావు ఆకులు వేసి వేయించాలి.
- Step 6
అరనిమిషం తరువాత ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.
- Step 7
అందులో కాస్త పసుపు, కారం కూడా వేసి కలపాలి. తరువాత జీలకర్రపొడి, ధనియాల పొడి, గరంమసాలా కూడా వేసి బాగా వేయించాలి. కాసేపయ్యాక టొమాటో గుజ్జు, ఉప్పు వేసి కలపాలి.
- Step 8
అవి బాగా వేగాక... ముందుగా కోసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, మిక్సీలో వేసి సోయా గ్రాన్యూల్స్ ను వేసి బాగా కలపాలి. అన్నీ కలిసి బాగా ఉడికే వరకు ఉంచాలి. అవసరమైదే నీళ్లు వేసుకోవచ్చు. లేదా చిన్న మంటమీద నీళ్లు లేకుండా ఉడికంచుకోవచ్చు.
- Step 9
కనీసం అయిదు నుంచి ఎనిమిది నిమిషాల ఉడికిస్తే ఖీమా కర్రీ సిద్ధమైపోతుంది. స్టవ్ మీద నుంచి దించే ముందు కొత్తి మీర చల్లుకుంటే సరి.