- Step 1
చేపముక్కలు కడిగి పసుపు, కారం,అరచెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసి కలిపి అరగంట పాటూ పక్కన పెట్టాలి. * ఇప్పుడు కళాయిలో కాస్త నూనె వేసి చేప ముక్కల్ని బాగా వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టాలి.
- Step 2
బాణలిలో మరికొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర, కారం, టమాటా ముక్కలు వేసి బాగా ఉడకబెట్టాలి.
- Step 3
అందులో రెండు కప్పుల నీళ్లు వేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉడికించాలి. ఆ సమయంలో చింతపండు రసం కూడా వేసేయాలి.
- Step 4
నీళ్లు తగ్గి ఇగురులా అవుతున్నప్పుడు ముందుగా వేయించిన చేపల్ని అందులో వేయాలి.
- Step 5
చేపముక్కలకి ఇగురు అంటేలా ఒక్కో ముక్కని కలపాలి. పైన కాస్త మెంతి పొడి, మసాలా చల్లి మళ్లీ కలపాలి. దించేముందు కొత్తి మీర చల్లాలి. వేడివేడి చేపల కుర్మా తినడానికి రెడీ అయినట్టే.