- Step 1
ముందుగా రొయ్యల్ని బాగా కడిగి... కారం, ఉప్పు, పసుపు వేసి అరగంట పాటూ పక్కన పెట్టాలి.
- Step 2
తరువాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో కాస్త నెయ్యి వేయాలి.
- Step 3
అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, టొమాటో, బంగాళాదుంపముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, కొబ్బరి తురుము వేసి వేయించాలి.
- Step 4
అందులోనే మారినేషన్ చేసిన రొయ్యలు కూడా వేయాలి.
- Step 5
ఆ మిశ్రమాన్ని బాగా వేగించాలి. రొయ్యలు ఇప్పుడు సగం ఉడికిపోవాలి.
- Step 6
తరువాత కడిగిన బియ్యాన్ని వేసి బాగా కలపాలి. అందులోనే నానబెట్టిన పెసరపప్పు, మినప్పప్పు, పసుపు, సాంబార్ పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
- Step 7
ఇప్పుడు రెండు కప్పులు బియ్యానికి నాలుగున్నర కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేయాలి. మూడు విజిల్స్ వచ్చాక దింపేస్తే సరి. రొయ్యల కిచిడీ తినడానికి సిద్దమైనట్టే.