- Step 1
ముందుగా మేక తలాకయాను శుభ్రంగా కడగాలి.
- Step 2
కుక్కర్ లో తలకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, వేసి 10 నిమిషాలు ఉడికించాలి.
- Step 3
ఇప్పుడు మిక్సలో 1 ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
- Step 4
ఇప్పుడు నూనె వేడి చేసి అందులో ఉల్లిముక్కలు, ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి.
- Step 5
ఇందులో కర్రీ మసలా, సన్నగా తరిగిన టమాట ముక్కలు వేసి 2 నిమిషాలు మగ్గించాలి.
- Step 6
ఇప్పుడు గరం మసాల వేసి 1 నిమిషం వేయించి ముందుగా కుక్కర్ లో ఉడికించుకున్న తలకాయ కూర వేసి తగినన్ని నీళ్ళుపోసి, ఉప్పు వేసి గ్రేవీ చిక్కగా వచ్చేవరకు ఉడికించి దించాలి. అంతే రుచికరమైన తలకాయ కూర రెడీ