- Step 1
బీట్ రూట్ ని చాలా సన్నగా తరుగుకోవాలి. వాటిని ఒక గిన్నెల్లో వేసి అందులో కార్న్ ఫ్లోర్, ఉప్పు, గరం మసాలా, పచ్చి మిరపకాయ తరుగు వేసి బాగా కలపాలి.
- Step 2
ఆ మిశ్రామాన్ని ఉండలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి... ఆ ఉండల్ని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయి పెట్టి కాస్త నూనె వేయాలి.
- Step 4
అందులో షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, పొడుగ్గా కోసుకున్న పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి వేసి వేయంచాలి.
- Step 5
ఇప్పుడు సోయాసాస్, చిల్లీ సాస్, టమోటా సాస్ కూడా వేసి బాగా కలపాలి.
- Step 6
అవి బాగా వేయించాక ముందుకు డీప్ ఫ్రై చేసి బీట్ రూట్ ఉండల్ని వేసి కలపాలి.
- Step 7
కాస్త గరం మసాలా చల్లి స్టవ్ కట్టేయాలి. పైన కాస్త కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి.